

రాజాసింగ్ ఎపిపోడ్.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై కేంద్ర మంత్రి , తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ(ఆదివారం) ఏబీఎన్‌తో కిషన్‌రెడ్డి మాట్లాడారు. శాసన సభ సమావేశాలు అత్యంత హుందాగా జరగాలని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పుణ్యమా అంటూ భాషా మారిందని విమర్శించారు. దాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ డొక్కా చిరుస్తా , తొక్కి పడేస్తా , అంతు చూస్తా అంటూ కొత్త బాషాకు తెర లేపారని కిషన్‌రెడ్డి సెటైర్లు గుప్పించారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు 60 రోజులు జరిగేవని…ఇప్పుడు 20 రోజులు జరిగే పరిస్థితి లేదని కిషన్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై రేవంత్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని అన్నారు. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తామని అన్నారు. గత కొద్దీ రోజులుగా తాను కూడా రాజాసింగ్ వ్యాఖ్యలను గమనిస్తున్నానని.. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. డీ లిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కొన్ని పార్టీలు పనికి మాలిన ప్రచారం చేయడం తప్ప ఏం లేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు..