రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.

రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.

   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో మల్కాజ్గిరి  చౌరస్తా నందు చలో పార్లమెంట్  పోస్టర్ ఆవిష్కరణ. 

మనోరంజని ప్రతినిధి మల్కాజిగిరి మార్చి 20 :- ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTWF) సిఐటియు ( అనుబంధo). యూనియన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాధ్యులు బంగారు నర్సింగరావు ముఖ్యఅతిథిగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం (AIRTWF – CITU) అండగా ఉంటుందన్నారు. రవాణా రంగంలో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా అర్హులైన వాళ్లందరికీ సంక్షేమ పథకాలు అందించాలని. ప్రమాద భీమా , మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. నాన్ లోకల్ పర్మిట్లను నియంత్రించాలి. ప్రైవేట్ ఓలా, ఉబర్, రాపిడోయాప్ లను నియంత్రించి, దోపిడిని అరికట్టాలి. 2019 మోటార్ వెహికల్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. 29 లేబర్ కోడ్ లను పునరుద్ధరించాలి. నాలుగు లేబర్ కోడ్ లు రద్దుచేయాలి. తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు దఫాలుగా ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. రవాణా రంగ కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను వాగ్దానం చేశారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరచలేదు దీనికి నిరసనగా ఈనెల 21వ తేదీన రవాణా రంగం కార్మికులతో ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ ధర్నా కార్యక్రమంలో ఆటో, ట్రాలీ, లారీ, డీసీఎం, బస్సు మొదలగు రవాణా రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క డ్రైవరు,హెల్పరు, వర్కరు పాల్గొన్నాలని పిలుపునిచ్చారు.. అదేవిధంగా మార్చి 24వ తేదీన చలో పార్లమెంటు దేశవ్యాప్త కార్యక్రమం జయప్రదం చేయాలన్నారు. ఆటో డ్రైవర్ల అందరికీ సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. అర్హులైన పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. ఆటో స్టాండ్ అడ్డా కోసం పార్కింగ్ స్థలాన్ని కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆర్టిఏ, ట్రాఫిక్ పోలీసుల వేధింపులు అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మల్కాజ్గిరి మండల కమిటీ నాయకురాలు కృష్ణమ్మ తో పాటు ట్రాలీ డ్రైవర్స్ భాష, వెంకటేష్, అంజన్న, ఆంజనేయులు, శంకర్, రాజు, తదితరులు పాల్గొనడం జరిగింది

  • Related Posts

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ ఏప్రిల్ 08 :- రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా…

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం. *మనోరంజని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 08 :- మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం సుద్దాల గ్రామములో సీఎం రేవంత్ రెడ్డి, మరియు ఎమ్మెల్యే వివేక్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గుర్తు తెలియని ట్రాక్టర్ ఆటోకు డి 13 మందికి గాయాలుఇద్దరి పరిస్థితి విషమం

    గుర్తు తెలియని ట్రాక్టర్ ఆటోకు డి 13 మందికి గాయాలుఇద్దరి పరిస్థితి విషమం

    LSG Vs KKR: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన లక్నో.. ఫలించని కేకేఆర్ బ్యాటర్ల విధ్వసం..!!

    LSG Vs KKR: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన లక్నో.. ఫలించని కేకేఆర్ బ్యాటర్ల విధ్వసం..!!

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.