

రంగు రాళ్ళ తవ్వకాలకు నిబంధనలు పట్టవా…?
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 16 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని పాచవ్వ గుట్టలో రంగు రాళ్ల కోసం జరుపుతున్న తవ్వకాలకు నిబంధనలు పట్టవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తవ్వకాల కోసం అనుమతి తీసుకున్న సదరు కాంట్రాక్టర్ నిబంధనలు పాటించడం లేదని చుట్టుపక్కల ఉన్న రైతులు వాపోతున్నారు. అదేవిధంగా పరిమితికి మించి వాహనాల్లో రాళ్లను తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ శాఖ అధికారులు విధిగా తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా నామమాత్రం గానే తనిఖీలు చేపడుతున్నారని పలువురు పేరుకొంటున్నారు. తవ్వకాలు జరుపుతున్నచోట భారీగా గుంతలు ఏర్పడుతున్నాయి. వర్షాకాలంలో గుంతల్లో నీళ్లు చేరి ప్రమాదానికి నేలువుగా మారుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. చుట్టుపక్కల ఉన్న రైతులతో పాటు పశువుల కాపర్లు తమ పశువులను అటువైపు మేపడానికి వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మైనింగ్ శాఖ అధికారులు స్పందించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు


