మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ నియామకం

మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ నియామకం

మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 22 :- రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం ముస్తఫానగర్ గ్రామానికి చెందిన కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ ను మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 21, 2025న కరీంనగర్‌లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ప్రకటన చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన కొత్త బాధ్యతలతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్‌గా నియమితులైన కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ, పూర్తి స్థాయి కమిటీల ఏర్పాటు, కార్యాచరణ అమలుకు కృషి చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ మాట్లాడుతూ, ఉద్యమ కార్యాచరణలో కుడెల్లి ప్రవీణ్ కుమార్ చేసిన కృషిని గుర్తించి ఈ పదోన్నతి అందించామని తెలిపారు. ఉద్యమ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన ఆకాంక్షించారు.

  • Related Posts

    జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత

    వేసవి కాలంలో విద్యార్థులకు తాగునీటి కష్టాలు లేకుండా చేయడానికి యూనిమోని ప్రైవేటు కంపెనీ నిర్మల్ పట్టణంలోని జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేసింది. ఈ కార్యక్రమంలో యూనిమోని నిర్మల్ బ్రాంచ్ మేనేజర్ రవి కుమార్, యూనిమోని స్టాఫ్ అఖిలేష్, నర్సయ్య,…

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు”

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు” ఆదాయ దృవపత్రాల జారీకి ఎందుకంత సమయం..!? ఫరూక్ నగర్ తహాసిల్దార్ పార్థసారధిని ప్రశ్నించిన ఎమ్మెల్యే శంకర్ సాంకేతిక లోపాలు తలెత్తాయని తహసిల్దార్ పార్థసారధి సమాధానం యువతకు సకాలంలో ప్రభుత్వ ధ్రువపత్రాలు జారీచేయాలని ఆదేశాలు సాంకేతిక లోపాలపై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత

    జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత

    తెలుగువారి తొలి పండగ… ఉగాది!..

    తెలుగువారి తొలి పండగ… ఉగాది!..

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు”

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు”