మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

జె.పి దర్గా ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీ ఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్

మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : తెలంగాణ సంస్కృతికి, మతసామరస్యానికి రంజాన్ మాసం ప్రతిక అని బీఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్ అన్నారు. బుధవారం సాయంత్రం కొత్తూరు మండలం జెపి దర్గా లో బీఆర్ఎస్ నాయకులు ఎజాస్ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ యువనాయకులు వై. మురళీకృష్ణ యాదవ్ పాల్గొని మాట్లాడారు. రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసిన అనంతరం ఇఫ్తార్ పేరుతో ఆహారాన్ని తీసుకోవడం ముస్లిం సంప్రదాయంలో ప్రధాన భాగమని, ఈ మాసంలో ఉపవాసం ఉండే ముస్లింలకు అల్లా కృప ఉండడంతోపాటు, ఆరోగ్యంగా ఉంటారని ఈ సందర్భంగా మురళి కృష్ణ యాదవ్ అన్నారు. అదేవిధంగా ముస్లిం సోదర,సోదరీమణులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జెపి దర్గాలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఫలహారాలను ఒకరికొకరు తినిపించుకోవడం సోదర భావానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మెండే కృష్ణ యాదవ్, నాయకులు పెంటనోళ్ళ యాదగిరి, తస్లీమ్, గోపాల్ నాయక్, జమాల్ ఖాన్, కుమ్మరి కుమార్, గోపి నాయక్, రషీద్, ముఖీద్, జహంగీర్, హనీఫ్, హనుమంతు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!! కులాలు, మతాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా నిర్వహించుకునే పండుగల్లో హోలీ(Holi Festival) ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆరోజున ఉత్సాహంగా…

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ మనోరంజని ప్రతినిధి మల్కాజిగిరి మార్చి :- 13 మల్కాజిగిరి మండల కమిటీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశ వర్కర్‌పై జరిగిన అత్యాచారం పై న్యాయం చేయాలని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.