

బీఆర్‌ఎస్ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 16 : హైదరాబాద్‌లో మార్చి 16, 2025న జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ నేతలు దళితులపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.ప్రధానంగా కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. ఆ సమయంలో తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి, ఆరోపణలు వచ్చినట్టు చెప్పి పదవి నుంచి తొలగించారని అన్నారు. జగదీష్ రెడ్డి దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ను అమర్యాదగా సంబోధించడాన్ని ఖండిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కేటీఆర్ ఆయనకు మద్దతు తెలపడం విడ్డూరమన్నారు. దళితుల పట్ల నిర్లక్ష్య ధోరణి బీఆర్‌ఎస్‌కు పుట్టుకతోనే ఉందని విమర్శించారు. ఇలాంటి నిరసనలు ప్రజలకు కనపడతాయని, త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు