

ప్రశ్నించే గొంతుకని గెలిపించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 03 :-ఏడాది కాంగ్రెస్ పాలనపై మేధావులు సరియైన తీర్పు చెప్పారు.. బిజెపి అభ్యర్థి మల్క కోమరయ్యను గెలిపించి, ఉపాధ్యాయ లోకం కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పారు. ప్రథమ ప్రాధాన్యత ఓట్లతోనే బిజెపి అభ్యర్థి గెలిచి చరిత్ర సృష్టించారు. ఇది బిజెపికి మరో ఘనమైన విజయం. ప్రశ్నించే గొంతు కను గెలిపించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. ముధోల్ నియోజకవర్గం నుండి పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులు బిజెపి పక్షాన నిలవడం తో నిరంతరం వారి సమస్యల పరిష్కారానికి బిజెపి ఎల్లప్పుడు వెన్నంటే ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసిన బిజెపి నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు తొలిమెట్టు… ప్రజల పక్షాన నిరంతరం బిజెపి పోరాడుతుంది.