ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలి.. ఉగాది సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలి.. ఉగాది సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ పర్వదినం వేళ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ (Ugadi Festival) సందర్భంగా ఓ ప్రకటనలో శుభాకాంక్షలు (Wishes) తెలిపిన కేసీఆర్.. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు (Changes) రావాలని కోరుకున్నారు. సాగునీరుతో సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతి మాతను (Mother Nature) ప్రార్థించారు. అలాగే రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుండి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా (Agriculture Year) ఉగాది నిలుస్తుందని కేసీఆర్ అన్నారు. ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు, ఉగాది గొప్ప పర్వదినం అని తెలిపారు. ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో, ఆది పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం ఉన్నదని అన్నారు. చెట్లు పచ్చగా చిగురిస్తూ, ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకుంటుందని, అదే నూతనోత్సాహం ప్రజల జీవితాల్లో నిండాలని కేసీఆర్ కోరుకున్నారు. రైతన్నలు, సబ్బండ వర్గాల సంక్షేమం దిశగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టి, ప్రజల జీవితాల్లో మరింతగా గుణాత్మక మార్పును తీసుకురావాలని ఆశించారు. అప్పుడే విశ్వావసు నామ నూతన సంవత్సరానికి సంపూర్ణత లభిస్తుందని అన్నారు. ఇక ఉగాది పచ్చడి మాదిరి, జీవితంలో షడ్రుచులను ఆస్వాదిస్తూ ప్రతీ సందర్భాన్ని వివేచనతో ఎదుర్కోవడం ద్వారానే మంచి చెడులు అర్థమై జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని బీఆర్ఎస్ అధినేత తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో సాగునీరు తాగునీరు పుష్కలంగా లభించి, సమృద్ధిగా పంటలు పండి, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని ప్రకృతి మాతను ప్రార్థిస్తున్నానని మాజీ సీఎం అన్నారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ పర్వదినం వేళ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ (Ugadi Festival) సందర్భంగా ఓ ప్రకటనలో శుభాకాంక్షలు (Wishes) తెలిపిన కేసీఆర్.. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు (Changes) రావాలని కోరుకున్నారు. సాగునీరుతో సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతి మాతను (Mother Nature) ప్రార్థించారు. అలాగే రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుండి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా (Agriculture Year) ఉగాది నిలుస్తుందని కేసీఆర్ అన్నారు. ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు, ఉగాది గొప్ప పర్వదినం అని తెలిపారు. ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో, ఆది పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం ఉన్నదని అన్నారు. చెట్లు పచ్చగా చిగురిస్తూ, ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకుంటుందని, అదే నూతనోత్సాహం ప్రజల జీవితాల్లో నిండాలని కేసీఆర్ కోరుకున్నారు. రైతన్నలు, సబ్బండ వర్గాల సంక్షేమం దిశగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టి, ప్రజల జీవితాల్లో మరింతగా గుణాత్మక మార్పును తీసుకురావాలని ఆశించారు. అప్పుడే విశ్వావసు నామ నూతన సంవత్సరానికి సంపూర్ణత లభిస్తుందని అన్నారు. ఇక ఉగాది పచ్చడి మాదిరి, జీవితంలో షడ్రుచులను ఆస్వాదిస్తూ ప్రతీ సందర్భాన్ని వివేచనతో ఎదుర్కోవడం ద్వారానే మంచి చెడులు అర్థమై జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని బీఆర్ఎస్ అధినేత తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో సాగునీరు తాగునీరు పుష్కలంగా లభించి, సమృద్ధిగా పంటలు పండి, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని ప్రకృతి మాతను ప్రార్థిస్తున్నానని మాజీ సీఎం అన్నారు

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌ సిటీ: ఏప్రిల్ 04 :-నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే