పసుపు క్వింటాల్కు 15 వేల ధరతో కొనుగోలు చేయాలి AIKMS డిమాండ్

పసుపు క్వింటాల్కు 15 వేల ధరతో కొనుగోలు చేయాలి AIKMS డిమాండ్

మెంట్రాజ్ పల్లి గ్రామం లో AIKMS ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు
ఈ సందర్భంగా AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ పసుపు రైతులు గత పక్షం రోజులుగా మార్కెట్లోకి పసుపును తెచ్చి అమ్ముకుందామంటే రైతులకు తగిన ధరలు రాక ఆందోళన చెందుతున్నారని వరన్నారు. మార్కెట్లో మధ్య దళారీలు, వ్యాపారస్తులు సిండికేట్గా మారి ధరలను తగ్గించి రైతులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని వేల్పూర్ భూమయ్య అన్నారు. పసుపు పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు అల్లాడుతున్నారు మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ ధరలు ఇక్కడ రైతులకు రావడం లేదు అధికారులు సైతం రైతులు వ్యాపారస్తుల మోసాలకు గురికాకుండా చూడడంలో విఫలమవుతున్నారు. రైతులు తమ పంట కు లాభసాటి ధర పొందలేకపోతున్నారు గతంలో కింటాలు పసుపుకు 16,000 వరకు ధరలు చెల్లించిన వ్యాపారస్తులు నేడు ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల వరకు ధరలు పెట్టడం లేదు దీనంతటికీ ప్రధానంగా మార్కెట్లో వ్యాపారస్తులు సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తున్నారని వరన్నారు. రైతులకు పెట్టిన పెట్టుబడులు రాలేక అప్పుల పాలవుతున్నారు. ఇన్దుకుగాను పసుపు క్వింటాల్కు 15 వేల ధర చెల్లించాలని రైతుల వద్ద ఉన్న పసుపును వెంటనే కొనుగోలు చేయాలని మా అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రోజులకొద్దీ మార్కెట్లో కుప్పలు పోసుకొని ఎదురుచూస్తున్నా రైతుల పసుపును కొనుగోలు చేయాలని వరి ధాన్యం మాదిరిగానే పసుపు క్వింటాల్కు 1000 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను నిలువున ముంచుతున్న వ్యాపారస్తులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.అలాగే రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయాలనీ, నిజామాబాదు లో గల చక్కెర ఫ్యాక్తరీలను ప్రభుత్వంమే తెరిపించి నడిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో దేవస్వామి, jp గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..!

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..! TG: తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడం సంచలనం రేపుతోంది. భద్రత వ్యవహారాల్లో నిర్లక్ష్యం తగదంటూ రాజాసింగ్ కు పోలీసులు లేఖ రాశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో…

    ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –

    ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు – ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 20 :- తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..!

    రాజాసింగ్ కు పొంచి ఉన్న ముప్పు..!

    అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…

    అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…

    ఓరి రాములా….ఇది విన్నావా…లేదా!అయితే ఈ వార్త చూడు

    ఓరి రాములా….ఇది విన్నావా…లేదా!అయితే ఈ వార్త చూడు

    ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –

    ప్రతిపక్షల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు –