పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 18 :- పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించిన సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పదవ తరగతి పరీక్షలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 9129 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకుగాను 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల ప్రశ్న, జవాబు పత్రాల తరలింపు సమయంలో పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద బందోబస్తు ను ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించాలని, ప్రతి పరీక్ష కేంద్రంలో త్రాగునీరు, వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ పొట్లాలు, ఇతర అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాల దగ్గర పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు జరిగే సమయాలలో కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని, 144 సెక్షన్ అమలు పరచి, పటిష్ఠ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రహరీ గోడలు లేని పరీక్ష కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా పరీక్షల సమయానికి తగ్గట్లుగా ఆయా మార్గాల్లో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపాలని సూచించారు. ఎటువంటి మాస్ కాపీయింగ్ కు తావు లేకుండా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్షలను ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ, పరీక్షలను నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షలను రాయబోవు విద్యార్థుల మానసిక ఒత్తిడిని దూరం చేసే విధంగా వారిలో మానసిక స్థైర్యం నింపాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఈఓ పి. రామారావు, భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, డిఎంహెచ్ఓ రాజేందర్, విద్యుత్ శాఖ డిఈ వెంకటేశ్వర్లు, విద్యాశాఖ అధికారులు పద్మ, లింబాద్రి, ప్రవీణ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

    నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అడెల్లి రోడ్‌లోని వింధ్య యూపీ పాఠశాలలో పేవరెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సారంగాపూర్ మాజీ జడ్పీటీసీ సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పద్మనాథ గౌడ్, సాయన్న యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.…

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది. చెరువుల‌ అభ‌వృద్ధికి ఆటంకాలు లేకుండా చేస్తాం సీఎస్ ఆర్ నిధుల‌తో సంస్థ‌లు ముందుకు రావాల‌న్న హైడ్రా ఔట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలో చెరువుల అభివృద్ధికి ఉన్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

    వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

    యువతిపై దాడి…అత్యాచార యత్నం

    యువతిపై దాడి…అత్యాచార యత్నం

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

    రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

    రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ