

నిత్యం ప్రజా సేవలో నిమగ్నమయ్యే ప్రొద్దుటూరు వినయ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి
కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి విన్నవించుకున్నారు సీనియర్ నాయకులు
కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చ్ 09 మనోరంజని ప్రతినిధి,
ఆర్మూర్ నియోజవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి పొద్దుటూరి వినయ్ రెడ్డికి ఇస్తే బాగుంటుందని, ప్రజలకు ఎల్లవేళల సేవలు చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు నాయకుల మరియు ప్రజలకు మరిన్ని సేవలందించడానికి పొద్దుటూరి వినయ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ఇప్పటివరకు ఆర్మూర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు, కనీసం ఈసారైనా ఆర్మూర్ ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరి వినయ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా కృషి చేయగల సామర్థ్యం ఉందని, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు, నిత్యం ప్రజాసేవకు ప్రాతినిథ్యం వహించే వినయ్ కుమార్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇస్తే భవిష్యత్తులో, కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, సీనియర్ నాయకులు కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ఎమ్మెల్సీ పదవికి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలిపారు