నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.

నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.

మనోరంజని ప్రతినిధి మంచిర్యాల జిల్లా, మార్చి 21మంచిర్యాల జిల్లా,జైపూర్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు రావు మొబైల్ యాప్ ఇన్స్పెక్షన్ లో భాగంగా జైపూర్ మండలం నర్సింగాపూర్ , కిష్టాపూర్ మరియు శివారం గ్రామ పంచాయతీల నీ సందర్శించడం జరిగింది. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని, గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని పంచాయితీ కార్యదర్శి కి సూచించడం జరిగింది. గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలియ చేసినారు. వాటర్ అండ్ శానిటేషన్ కు సంభందించిన 7 రిజిష్టర్లను పరిశీలించారు. సెగ్రిగేషన్ షెడ్ నందు కంపోస్టు ఎరువు తయారు చేయాలని సూచించారు. నర్సరీని పరిశీలించి మొక్కలు 100 శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించడం జరిగింది. ఇట్టి పర్యటనలో నర్సింగాపూర్ పంచాయితీ కార్యదర్శి లోకుల ప్రశాంత్, శివారం కార్యదర్శి గాజుల ప్రవీణ్, మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్. *మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?