దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం

దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం

నిర్మల్ డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు.

మామడ మండలం “అంబేద్కర్ మాదిగల సంఘం” ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సిఎం.రేవంత్ రెడ్డి, మందకృష్ణ మాదిగ, చిత్రపటాలకు పాలాభిషేకం.

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 20 :- నిర్మల్ జిల్లా:
మండల కేంద్రంలో గురువారం మామడ మండలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాదిగల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్, సీఎం.రేవంత్ రెడ్డి, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం నిర్మల్ డిసిసి అధ్యక్షులు శ్రీ హరి రావ్ మాట్లాడుతూ,
మూడు దశాబ్దాలకు పైగా జరుగుతున్న ఎస్ సి వర్గీకరణ ఉద్యమం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏకైక ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. దీనితో పాటు బీసీ.లకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టడం, దీనిని రాజకీయ, ఉపాధి, విద్య, ఉద్యోగ రంగాల్లో అమలుపరచడంలాంటి నిర్ణయంతో, భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలిచిందని అభివర్ణించారు. రాహుల్ గాంధీ అప్పటి పాదయాత్ర సందర్భంగా ప్రజలకు సమాజంలో మానవీయ కోణంలో, ఏకులం ఎంతమంది ఉన్నారో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన వాగ్దానంను అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కుల గణన చేపట్టారు. కులాల వారిగా గణాంకాలు సేకరించి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు మద్దతుగా, బ్రిటిష్ వారి తర్వాత, స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఎవరూ తీసుకొని ఈ సాహసోపేత నిర్ణయం వల్ల రాష్ట్రంలోని అన్నీ కులాలవారికి సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మామడ మండల మాదిగల సంఘం అధ్యక్షులు మోతె రాజన్న, జనరల్ సెక్రెటరీ ప్రశాంత్, ముండ్ల పోషెట్టి, ఆశన్న , పోషన్న, ముండ్ల తిరుపతి, నరేష్, మండలంలోని ఆయా గ్రామాల మాదిగలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మామడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తిప్పారపు బాపయ్య, నల్ల లింగారెడ్డి, సంతోష్, పడాల శ్రీనివాస్, అన్వర్, వకీల్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం