

దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 16 – నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. దర్పల్లి మండలం హోన్నాజిపేటలో భార్య కొడుకుతో కలిసి భర్త మల్లయ్యను చంపేసింది. మల్లయ్య రోజూ తాగి వచ్చి వేధిస్తుండడంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం నిందితులు ఇద్దరు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.