తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది..!!

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది..!!

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ గతంలోనూ నోటీసులు ఇచ్చింది. ఇందుకు సుప్రీంకోర్టు గడువు కూడా విధించింది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ప్రజలు కారు గుర్తుపై గెలిపించాక పార్టీ మారడం వారి నమ్మకాన్ని వమ్ము చేయడమేనని బీఆర్ఎస్ విమర్శించింది.దీనిపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ను ఆదేశించాలని కోరింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి, 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22లోగా స్పందించాలని ఆదేశిస్తూ విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది. అయితే, గడువు ముగిసినా తెలంగాణ స్పీకర్ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసింది

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం