తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టుల భర్తీకి కోసం టీజీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించగా.. ఈరోజు ఫలితాలను రిలీజ్ చేసింది. గత ఏడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్-3 రాత పరీక్షలు జరిగాయి. ఈ పోస్టుల కోసం 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. గ్రూప్‌-3లో టాప్‌ ర్యాంకర్‌(పురుషులు) 339.24 మార్కులు, గ్రూప్‌-3లో మహిళా టాప్‌ ర్యాంకర్‌కు 325.15 మార్కులు వచ్చాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చిన టీజీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు. కాగా.. ఈ నెలలోనే గ్రూప్ 1, గ్రూప్ -2 ఫలితాలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈనెల 10, 11 తేదీల్లోనే గ్రూప్ 1 మెయిన్ ఫలితాలు, గ్రూప్-2 రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు జరిగాయి. ఈ మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ – 1 ఫలితాలను మార్చి 10న టీజీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలైన తర్వాతి రోజే గ్రూప్ -2 ఫలితాలను కూడా విడుదల చేసింది టీజీపీఎస్సీ. ఈనెల 11న గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 2.36 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 2 టాపర్‌కు అత్యధికంగా 447 మార్కులు వచ్చాయి. జనరల్ ర్యాంకులతో పాటు ఫైనల్‌ కీ కూడా విడుదలైంది.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్