

టాస్ ఓడిన టీమిండియా..
ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ప్రతిష్టాత్మక టైటిల్ ఫైట్‌లో భాగంగా తొలుత టాస్ వేశారు. అందుకోసం అటు కివీస్ నుంచి కెప్టెన్ మిచెల్ శాంట్నర్, ఇటు టీమిండియా నుంచి సారథి రోహిత్ శర్మ గ్రౌండ్‌లోకి వచ్చారు. టాస్ ఎవరు గెలుస్తారోనని రెండు జట్ల అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూశారు. టాస్ ఓడటంలో రోహిత్‌కు ఉన్న రికార్డు దృష్ట్యా ఇది అందర్నీ ఆకర్షించింది. అయితే ఈసారి కూడా భారత సారథికి చేదు అనుభవం తప్పలేదు. మళ్లీ హిట్‌మ్యాన్ టాస్ ఓడిపోయాడు. టాస్ నెగ్గిన కివీస్ తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. దీంతో భారత్ బౌలింగ్‌కు దిగనుంది.