జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి.. కానీ అవకాశాలు సృష్టించుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు రాజకీయంగా క్రాస్ రోడ్స్ లో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు, వైసీపీ అధినేత జగన్ కు ఓ చాన్స్ వచ్చింది. ఈ రెండు రాజకీయ పార్టీల అధినేతలు తమ అవకాశాలను సృష్టించుకునే విషయంలో పూర్తిగా వెనుకబడిపోయారు. కానీ ఇప్పుడు వెదుక్కుంటూ ఓ అవకాశం వచ్చింది. అది స్టాలిన్ రూపంలో .

మోదీపై పోరాటానికి పిలుపునిచ్చిన స్టాలిన్

స్టాలిన్ దక్షిణాది సెంటిమెంట్ ను మరింత పెంచి.. బీజేపీకి దక్షిణాదిలో చోటు లేకుండా చేయాలని డిసైడయ్యారు. అందుకే ప్రత్యేకంగా సమావేశం పెట్టి దక్షిణాదికి చెందిన ప్రముఖ పార్టీలను పిలుపుస్తున్నారు. ఆయన ప్రతినిధులు హైదరాబాద్, విజయవాడ వచ్చి సమావేశానికి రావాలని జగన్, కేసీఆర్‌లను ఆహ్వానించారు. ఇది వారికి వచ్చిన గొప్ప అవకాశం అనుకోవచ్చు. ఎందుకంటే రెండు పార్టీలకూ ఇప్పుడు వెళ్తున్న దారి పరోక్షమే.

ప్రత్యక్షంగా ఏదో ఓ దారి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.

బీజేపీతో దోస్తీ కష్టమే – పోరాటమే శరణ్యం

బీజేపీని ఎదిరించి బతికి బట్టకట్టే పరిస్థితి లేదని కేసీఆర్, జగన్ అనుకుంటున్నారేమో తెలియదు కానీ వ్యతిరేకించకపోతే మాత్రం ఆ పార్టీలు నిర్వీర్యం అయిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీజేపీ నోట చిక్కింది. ఇంకా కొద్ది రోజులు పోతే బీఆర్ఎస్ ఉనికిని బీజేపీ దెబ్బతీస్తుంది . అయినా కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై కేటీఆర్ మాట్లాడుతున్నారు. కానీ అది బీజేపీ యాంగిల్లో కాదు. ఇక్కడే వారి చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుంది. అలాగే జగన్ కూడా. తమ వ్యతిరేక పార్టీలతో ఎన్డీఏ కూటమిగా ఏర్పడితే ఆ కూటమికే మద్దతివ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వైసీపీ. ఇలాంటి పరిస్థితిని ఎందుకు దూరం చేసుకోకూడదు.

పోరాడితే పోయేదేం ఉంటుంది?

పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప… అని గుర్తు చేసుకుంటే.. ఈ రెండు పార్టీల అధినేతలు ధైర్యం చేసి స్టాలిన్ సమావేశానికి వెళ్తారు. అక్కడ బీజేపీని చీల్చి చెండాడుతారు. ఆ తర్వాత అదే పద్దతిలో బీజేపీని ప్రత్యర్థిగా చేసుకుంటారు . అలా చేసుకోవడం వల్ల ఈడీ, సీబీఐలు వస్తాయని భయపడతారేమో కానీ అలా రావడం వల్ల కూడా వారికి రాజకీయ ప్రయోజనం ఉంటుంది. మరి ఈ ఇద్దరు అగ్రనేతలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా?

  • Related Posts

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’ భారతదేశంలో ప్రస్తుతం దేశనలుమూలల 5G సర్వీసు లభిస్తోందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 776 జిల్లాల్లో 773 జిల్లాలకు ఈ సర్వీసు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. టెల్ కమ్ సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు అన్ని…

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. ఇకనుంచి తమ ప్రయాణ సమయంలో చిప్స్, శీతల పానీయాలు, బిస్కెట్లు, ఇతర ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ప్రయాణికులు ఆస్వాదించవచ్చని.. ఇండియన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .