ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూలింగ్‌పై కొనసాగుతున్న వివాదం.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ విమర్శలు

ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూలింగ్‌పై కొనసాగుతున్న వివాదం.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ విమర్శలు

ఇంటర్నెట్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా ఆడటం అనేక మంది అంతర్జాతీయ క్రికెటర్లకు నచ్చడం లేదు. దీంతో, ఐసీసీపై వారందరూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ జాబితాలోకి తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వచ్చి చేరారు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల షెడ్యూలింగ్ తలవంపులు తెచ్చేదిగా హాస్యాస్పందంగా ఉందని డేవిడ్ లాయిడ్ విమర్శలు గుప్పించారు. ‘ఇది నిజంగా నాన్సెన్స్. అసలు ఈ పరిణామాల్ని ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది ఓ ప్రపంచస్థాయి కార్యక్రమం. టీమ్‌లు ఒక చోట నుంచి మరోచోటకు ప్రయాణిస్తుంటాయి. ఒక్కోసారి వెళ్లిన ప్రాంతానికి వెళతామో లేదో కూడా స్పష్టత ఉండదు. వాస్తవానికి నేను హాస్యప్రియుణ్ణే. అయితే, ఓ ప్లేయర్ మాత్రం ఇదేమంత లైట్ తీసుకునే విషయం కాదు’’ అంటూ విమర్శలు ఎక్కువపెట్టారు. ప్రస్తుత టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇస్తుండగా భారత్ తప్ప టోర్నీలో పాల్గొనే ఇతర దేశాలు పాక్, దుబాయ్ మధ్య చక్కెర్లు కొడుతున్నాయి. టీమిండియాను పాక్‌కు పంపించే ప్రసక్తే లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో, భారత్ మ్యాచులన్నీ దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా జరిగాయి. దీంతో, స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇది భారత్‌కు ఉపకరిస్తుందని అనేక మంది క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అన్యాయంగా భారత్‌కు లాభం చేకూర్చే పరిణామని విమర్శించారు. ఫైనల్స్ సమీపిస్తున్న తరుణంలో విమర్శలు జడి మరింత పెరిగింది. ఇక దక్షిణాఫ్రికాపై భారీ విజయంతో న్యూజిలాండ్ టోర్నీ ఫైనల్స్‌కు చేరుకుంది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్స్ అజేయ సెంచరీలతో న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేరుకోలేక దక్షిణాఫ్రికా ఓటమి చవి చూసింది. డేవిడ్ మిల్లర్ సెంచరీ చేసినా దక్షిణాఫ్రికాకు నిరుపయోగంగా మారింది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌లో దక్షిణాప్రికాకు ఇది వరుసగా ఐదో ఓటమి, 2000, 2002, 2006, 2013 టోర్నీల్లో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా ఓటమితో వెనుదిరగాల్సి వచ్చింది

  • Related Posts

    చెస్‌లో నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేసిన తెలంగాణ బాలుడు

    చెస్‌లో నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేసిన తెలంగాణ బాలుడు చెస్‌లో నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేసిన తెలంగాణ బాలుడుతెలంగాణ : నల్లగొండ జిల్లాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి గుండా కార్తికేయ చెస్‌లో ప్రపంచ రికార్డు సాధించాడు. 180…

    పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన

    పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన మనోరంజని ప్రతినిధి మార్చి 16 – పద్మ అవార్డులు-2026 కోసం నామినేషన్లు ప్రారంభమయ్యాని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. పద్మ విభాగంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. పద్మ అవార్డులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష