చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

చెరువుల‌ అభ‌వృద్ధికి ఆటంకాలు లేకుండా చేస్తాం సీఎస్ ఆర్ నిధుల‌తో సంస్థ‌లు ముందుకు రావాల‌న్న హైడ్రా

ఔట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలో చెరువుల అభివృద్ధికి ఉన్న ఆటంకాల‌న్నీ తొల‌గిస్తాం.. సిఎస్ ఆర్ నిధుల‌తో కార్పొరేట్, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ముందుకు రావాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌ కోరారు.

చెరువుల సుంద‌రీక‌ర‌ణ‌కే ప‌రిమితం కారాద‌ని.. చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయ‌డంపై దృష్టి పెట్టాల‌ని సంస్థ‌ల‌కు సూచించారు.

చెరువుల అభివృద్ధికి సీఎస్ ఆర్ నిధులు వెచ్చిస్తున్న‌, వెచ్చించ‌డానికి సిద్ధంగా ఉన్న దాదాపు 72 సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు బుధ‌వారం స‌మావేశ‌మ‌య్యారు.

జీహెచ్ ఎంసీ లేక్స్ విభాగం అద‌న‌పు క‌మిష‌న‌ర్‌ కిల్లు శివ‌కుమార్‌నాయుడు. తెలంగాణ సోష‌ల్ ఇంపాక్ట్ గ్రూప్ సీఎస్ ఆర్ వింగ్ డైరెక్ట‌ర్ అర్చ‌నా సురేష్‌తో పాటు.. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ ఎంసీ, ఇరిగేష‌న్‌, రెవెన్యూ అధికారులు ఈ స‌మావే శానికి హాజ‌ర‌య్యారు.

మాధాపూర్‌లోని సున్నం చెరువు, త‌మ్మిడికుంట, కూక‌ట్‌ప‌ల్లిలోని న‌ల్ల చెరువు, ఉప్ప‌ల్‌లోని న‌ల్ల‌చెరువు, అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ‌కుంట‌, పాత‌బ‌స్తీలోని బ‌మృక్నుద్దీన్ దౌలా చెరువుల‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామ‌ని.. క‌మిష‌న‌ర్ చెప్పారు.

ఔట‌ర్ రింగురోడ్డు ప‌రిధిలో 1025 చెరువులుండ‌గా.. ఇందులో 61 శాతం జాడ లేకుండా ఉన్నాయ‌ని.. ఉన్న 39 శాతం చెరువుల‌ను ప‌రిర‌క్షించుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు

  • Related Posts

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 28 – నిర్మల్ జిల్లా: రబి సీజన్ కు సంబంధించి వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్…

    బాలాపూర్ లో రుణ మాఫీ చెయ్యాలని సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చిన ఛైర్మన్ మర్రి నరసింహ రెడ్డి

    బాలాపూర్ లో రుణ మాఫీ చెయ్యాలని సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చిన ఛైర్మన్ మర్రి నరసింహ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 28 : బాలాపూర్ మండలం లో అందరికీ రుణ మాఫీ కాలేదు అని , రైతు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    శ్రీ రామనవమి శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

    శ్రీ రామనవమి శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

    పై ఎలక్ట్రానిక్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్