చించోడు గ్రామపంచాయతీ ఆవరణలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి రంగస్వామి

చించోడు గ్రామపంచాయతీ ఆవరణలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి రంగస్వామి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 04 : గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటుతో నేరాలను నిరోధించవచ్చని షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంగస్వామి అన్నారు. ఫరూక్ నగర్ మండలం చించోడు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సీసీ కెమెరాలు ఏసీబీ రంగస్వామి సిఐ విజయ్ కుమార్ తదితరుల గ్రామ పెద్దల సమక్షంలో లంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏసిపి రంగస్వామి మాట్లాడుతూ.. గ్రామంలో కదలికలను ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలిస్తూ ఉంటారని తెలిపారు. ఏ చిన్న నేరం జరిగిన ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే స్పందించే ఆస్కారం ఉంటుందని ఎసిపి అన్నారు. ప్రజలు చైతన్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని స్వచ్ఛందంగా పోలీసు శాఖకు సహకారం అందించడం అభినందనీయమని వారిని కొనియాడారు. రెండు లక్షల రూపాయల వ్యయంతో 14 సీసీ కెమెరాలు ఊరు చుట్టూ మొత్తం నిఘానేత్రం ఆధీనంలో ఉంటుందని ఇది ఎంతో శుభ పరిణామం అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల గ్రామంలో మద్యపాన నిషేధం గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమయంలో స్థానిక విజయ్ కుమార్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలకు సీసీ కెమెరాలుపై అవగాహన కల్పించడం జరిగిందని గ్రామ పెద్దల సహకారంతో వెంటనే రెండు లక్షల రూపాయలతో 14 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అజ్మత్ బాబా, అక్కిగారి శ్రీధర్,గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష