చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 17 – రాజకీయాలు కలుషిత మయ్యాయో రాజకీయ నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరు పై యూనివర్సిటీ లు, సంస్థలు ఉంటే.. పరిపా లనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దానిని పరిష్కరించేందుకు రాష్ట్రంలోని యూనివర్సి టీలు, సంస్థలకు తెలంగాణ కు సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు వర్సీటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన తరుణంలో అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత రాస్ట్రం లో అనేక యూనివర్సిటీల కు పేర్లు మార్చుకున్నాం. పరిపాలన సౌలభ్యం కోసమే కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహా రావు, కాళోజీ నారాయణ రావు పేర్లు పెట్టుకున్నామని గుర్తు చేశారు. అదే ఒరవడిలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతున్నట్టు వెల్లడించారు. తెలంగాణ సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారు. గోల్కొండ పత్రికను సురవరం నడిపారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవ్వరికీ వ్యతిరేకి కాదు. కులం, మతం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలను కోవడం సరికాదు అన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి లేఖ రాస్తానని ప్రతిపాదిం చారు సీఎం రేవంత్ రెడ్డి.

  • Related Posts

    నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయిదెబ్బతిన్న వంద చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి

    నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయిదెబ్బతిన్న వంద చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండిచెప్పులరిగే దాకా తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదునియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 18 :-ముధోల్ నియోజక వర్గంలో గతంలో…

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయిదెబ్బతిన్న వంద చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి

    నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయిదెబ్బతిన్న వంద చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు