గ్రైనేట్స్ తవ్వకాలను ఆపాలని తహసిల్దార్ కు వినతి

గ్రైనేట్స్ తవ్వకాలను ఆపాలని తహసిల్దార్ కు వినతి

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో జనావాసాలకు సమీపంలో ఉన్న గ్రానైట్స్ తవ్వకాలను ఆపాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల నిర్మల్ జిల్లా (ఎన్.హెచ్.ఆర్.సి) కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ శ్రీకాంత్ వినతి పత్రం అందించారు. తవ్వకాలు- బ్లాస్టింగ్ వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసి గ్రానైట్స్ రాళ్లను కాంట్రాక్టర్ అక్రమంగా తీసుకెళ్లిన ఎవరూ పట్టించుకోవడం లేదు. అటువైపు వెళ్లే దారిలో బస్సులు, ఆటోలు, లారీలు వెళ్లే క్రమంలో తరచూ బ్లాస్టింగ్ నడుస్తూ ఉంటుంది. అక్కడినుండి పాదచారులు, వాహనాలు వెళ్తుండగా బ్లాస్టింగ్ అయితే ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎవరు కూడా ప్రత్యేక తీసుకోవడం లేదు అన్నారు. ఇప్పటికి చాలా సంవత్సరాల నుండి గ్రానైట్స్ తవ్వకాలు జరుగుతున్నవి. కోట్లాది రూపాయల గ్రానైట్స్ రాళ్ల తవ్వకం అనేది ప్రభుత్వపరంగా నడుస్తుందా లేదా ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తున్నారనే విషయాన్ని ప్రజలకు బహిరంగపరచాలని తెలియజేస్తున్నాం. అక్రమంగా తవ్వకాలు జరిగినట్లు తేలితే సంబంధిత కాంట్రాక్టర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్.సి రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యవంశీ మాధవరావు పటేల్, బైంసా పట్టణ అధ్యక్షుడు జిల్లా హన్మండ్లు, కుంటాల మండల అధ్యక్షుడు గుమ్ముల దినేష్ కుమార్, ఎన్. హెచ్ ఆర్.సి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లేఖ రాశారు. భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీరాములు గారు…

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    స్వాతంత్య్ర సమరయోధుడు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా దక్షత, సాహితీ ప్రేమ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..