

గుండెపోటుతో లా విద్యార్థి మృతి
తెలంగాణ : రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో లా విద్యార్థి మృతి చెందాడు. నందిగామలోని సింబయోసిస్ డీమ్డ్ వర్సిటీ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సింబయోసిస్ డీమ్డ్ వర్సిటీలో ఢిల్లీకి చెందిన షాద్నీక్ లా మూడో తరగతి చదువుతున్నాడు. స్నానానికి గదిలోకి వెళ్లి గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు