క్రీడలు మహిళల ఆరోగ్యానికి దోహదపడతాయి

క్రీడలు మహిళల ఆరోగ్యానికి దోహదపడతాయి

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 11 :- క్రీడలు మహిళల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం కొండాపూర్ సమీపంలోని నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో జిల్లా యువజన సర్వీసులు, క్రిడల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మహిళల ప్రత్యేక క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంచే గొప్ప సాధనంగా నిలుస్తాయని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. విజయం సాధించినవారు విజయాన్ని మరింత ప్రేరణగా తీసుకుని ముందుకు సాగాలని, అలాగే ఇతర క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు ఈ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ప్రగతి సాధిస్తున్నారన్నారు. మహిళల క్రీడా ప్రోత్సాహానికి జిల్లాలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన మహిళలకు కలెక్టర్ బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, మహిళ ఉద్యోగులు, నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్స్ నందకుమార్, పోతన్న, కిషోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!! కులాలు, మతాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా నిర్వహించుకునే పండుగల్లో హోలీ(Holi Festival) ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆరోజున ఉత్సాహంగా…

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ మనోరంజని ప్రతినిధి మల్కాజిగిరి మార్చి :- 13 మల్కాజిగిరి మండల కమిటీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశ వర్కర్‌పై జరిగిన అత్యాచారం పై న్యాయం చేయాలని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.