

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కొండ సురేఖ, రాజగోపాల్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు
టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సహచర ఎమ్మెల్యేలు శ్రీహరి, పలువురి శుభాకాంక్షలు
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 15 : బడుగు బలహీనవర్గాల నేత, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుసుకొని స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి, తదితరులు ఎమ్మెల్యే శంకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మీయంగా సన్మానించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు పూల బొకేలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా అనేక సేవలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ ఎమ్మెల్యే శంకర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మంచి రాజకీయ అభివృద్ధి కూడా సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహచర ఎమ్మెల్యేలు మంత్రులకు అందరికీ పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా తనపై ఎంతో అభిమానం చాటుతూ కార్యకర్తలు పార్టీ శ్రేణులు నాయకులు అధికారులు జర్నలిస్టులు ఎంతోమంది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారని వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన పట్ల ఎంతో ఆత్మీయత అభిమానం చాటుకున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఎమ్మెల్యే శంకర్ మీడియాతో అన్నారు.
