ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని ఓ వ్యక్తి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు, ధరించిన ఆ దుండగుడు అర్థరాత్రి వేళ జూబ్లీహిల్స్‌లోని ఇంట్లోకి ప్రవేశించాడు. కిచెన్, హాలులోని సీసీటీవీ కెమెరాలను చాకచక్యంగా ఆఫ్ చేశాడు. దాదాపు గంటన్నర పాటు కిచెన్‌లో కలియతిరిగాడు. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో డేకే అరుణ ఇంట్లో లేరు. డీకే అరుణ ఇంటి వాచ్‌మ్యాన్ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీల్లో దుండగుడికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. వాటి సాయంతో విచారణ వేగవంతం చేశారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి ఆనవాళ్ల కోసం వెతికారు. దుండుగుడి కోసం అన్ని చోట్లా గాలిస్తున్నారు. అయితే, దుండగుడు గంటన్నర పాటు ఇంట్లో ఉన్నా ఏ వస్తువును దొంగలించలేదు. ఇదే పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇక, ఈ సంఘటనపై డీకే ఆరుణ స్పందించారు. తనపై ఏదైనా కుట్ర జరుగుతోందన్న అనుమానం ఉందన్నారు. తన ఇంటికి భద్రత పెంచాలని కోరారు. కాగా, ఈ మధ్య కాలంలో ప్రముఖుల నివాసాలకు భద్రత లేకుండా పోతోంది. కేవలం రాజకీయ నాయకులే కాదు.. సినిమా సెలెబ్రిటీల ఇళ్లలోకి కూడా దుండగులు చొరబడుతున్నారు. కొన్ని నెలల క్రితం సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఆయనపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్