ఉపవాసం భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఓ మార్గం : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

ఉపవాసం భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఓ మార్గం : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పర్వదినం

షాబాద్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

షాబాద్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దండు రాహుల్ గుప్తా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 17 : ఇస్లాం మతం ప్రకారం రంజాన్ మాసంలో ఉపవాసం చేసే వారు భగవంతుని అనుగ్రహం పొందుతారని,మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పర్వదినం అని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు .సోమవారం షాబాద్ కేంద్రంలోని పహిల్వాన్-షా- వలి దర్గా లోకాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దండు రాహుల్ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. ఇఫ్తార్ విందులో తోటి వారికి కూడా భోజనాన్ని అందించడం సంప్రదాయమని, సూర్యస్త సమయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మంచినీళ్లు, ఖర్జూర పండును తిని ఉపవాస దీక్షను విరమించడం రంజాన్ మాస సంప్రదాయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు భిన్నత్వంలో ఏకత్వంలా, మతాలకతీతంగా పర్వదినాలను జరుపుకోవడం ఇక్కడి సంస్కృతి అని అభిప్రాయపడ్డారు.తెలంగాణ సాంస్కృతిలో మతాల మధ్య తారతమ్యాలు ఉండవని, అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల పర్వదినాలలో పాల్గొంటారని అభిప్రాయపడ్డారు ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసేందుకు దండు రాహుల్ గుప్తా ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో గుడి మల్కాపూర్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీలు, కుమ్మరి చెన్నయ్య ,గుండల అశోక్,కాంగ్రెస్ నాయకులు అక్తర్ పాషా,ఇబ్రహీం, పహిల్వాన్అన్వర్,మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, గ్రామస్థులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లేఖ రాశారు. భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీరాములు గారు…

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    స్వాతంత్య్ర సమరయోధుడు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా దక్షత, సాహితీ ప్రేమ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..