

ఈ నెలలో రెండు గ్రహణాలు
ఖగోళ ప్రియులకు గుడ్ న్యూస్.
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈ నెల 13-14తేదీల మధ్య సంభవించనున్నది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కావడం విశేషం. అయితే ఈ గ్రహణం మాత్రం భారత్లో కనిపించే అవకాశం లేదు. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఈ నెల 29న ఆవిష్కృతం కానున్నది. ఈ గ్రహణం పాక్షిక గ్రహణం. ఇది కూడా భారత్లో కనిపించే అవకాశం లేదు.