ఈ ఉగాదికి 4.5 ఇందిరమ్మ ఇండ్లు

ఈ ఉగాదికి 4.5 ఇందిరమ్మ ఇండ్లు

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 21 – తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత్రుత్వంలోని తెలంగాణ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఈ ఏడాది పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని కొత్త ఒరవడితో పునరుద్ధరించింది సర్కార్. ప్రజాపాలనాలో పేదలకు ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఈ స్కీమును ప్రతిష్టాత్మకం గా తీసుకున్న ప్రభుత్వం ఉగాది పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది. దీనికోసం కార్యాచరణ సిద్ధం చేసి బడ్జెట్ లో భారీ నిధులను కేటాయించింది. అందువల్ల ఈ స్కీము విషయంలో ప్రభుత్వం చాలా నిబద్ధతో ఉందనే సంకేతాలను ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్స రానికి రూ. 12,571 కోట్లు కేటాయించడతో ఈ స్కీము వేగం పుంజుకుంది. గత బడ్జెట్ లో రూ. 3,184 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం, ఈ సారి రూ. 3,387కోట్లు అదనంగా కేటాయించి లబ్దిదారుల్లో ఉత్సాహాన్ని నింపింది. అందువల్ల ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శల కు చెప్ పెట్టినట్లవుతోందని విశ్లేషకులు అంచనా వస్తున్నారు. కేంద్రం సహకారం లేకపోయి నా వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల కోడ్ అడ్డంకి తొలగడంతో ఇళ్ల నిర్మాణం ఊపందుకుం టుంది. ఇప్పటికే 72వేల మంది లబ్దిదారులను ఎంపిక చేసి కొందరికి జనవరి 26న మంజూరు పత్రాలను అందజేశారు. మిగతావారికి త్వరలోనే ఇవ్వనున్నారు

  • Related Posts

    జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత

    వేసవి కాలంలో విద్యార్థులకు తాగునీటి కష్టాలు లేకుండా చేయడానికి యూనిమోని ప్రైవేటు కంపెనీ నిర్మల్ పట్టణంలోని జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేసింది. ఈ కార్యక్రమంలో యూనిమోని నిర్మల్ బ్రాంచ్ మేనేజర్ రవి కుమార్, యూనిమోని స్టాఫ్ అఖిలేష్, నర్సయ్య,…

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు”

    కార్యాలయానికి కదిలి వచ్చిన “శంకరుడు” ఆదాయ దృవపత్రాల జారీకి ఎందుకంత సమయం..!? ఫరూక్ నగర్ తహాసిల్దార్ పార్థసారధిని ప్రశ్నించిన ఎమ్మెల్యే శంకర్ సాంకేతిక లోపాలు తలెత్తాయని తహసిల్దార్ పార్థసారధి సమాధానం యువతకు సకాలంలో ప్రభుత్వ ధ్రువపత్రాలు జారీచేయాలని ఆదేశాలు సాంకేతిక లోపాలపై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

    రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

    బిజెపి కార్యకర్తలపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

    బిజెపి కార్యకర్తలపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    హీటెక్కిన ఆంధ్రప్రదేశ్‌.. 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు