ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :-

ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల డివిజన్ అధ్యక్షురాలు విజయ లక్ష్మి మాట్లాడుతూ ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 18000 వేల వేతనాలన్ని చెల్లించాలని పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన అశాలకు, ఏఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలన్నారు. పని భారం తగ్గించి, పారితోషికం లేని విధులు నిర్వహించకుండా చూడాలన్నారు. డ్యూటీలు వేసే సందర్భంలో వెహికిల్స్ తో పాటు సిబ్బందిని ఎర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రాధ, సులోచన, సావిత, అప్సరీ, ఇంద్ర, సుజాత, మమత, లత, యమున, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లేఖ రాశారు. భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీరాములు గారు…

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    స్వాతంత్య్ర సమరయోధుడు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా దక్షత, సాహితీ ప్రేమ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..