ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ( RSASTF )

ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ( RSASTF )

  • రూ. 35 లక్షల విలువ గల 34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
  • ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు
  • రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం

కడప జిల్లా బద్వేలు అటవీ ప్రాంతంలో 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీ జి. బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో మేరకు ఆర్ ఐ చిరంజీవులు కు చెందిన ఆర్ ఎస్ ఐ పి.నరేష్ టీమ్ గురువారం నుంచి బద్వేలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సి.రామాపురం సమీపంలో ఎద్దులబోడు వద్ద రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వీరు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల పరిశీలించగా 34 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి నించి మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుంగలతో సహా స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వీటి విలువ రూ. 35లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసును ఎస్ ఐ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Related Posts

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు జెత్వానీని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన కేసు ఇప్పటికే సస్పెండ్ అయిన పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు మనరంజని రంగారెడ్డి…

    అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనం పట్టివేత అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు – తహసీల్దార్ లింగం మూర్తి మనోరంజని ప్రతినిధి తానూర్ మార్చి 13 – అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ లింగం మూర్తి స్పష్టం చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .