

ఆదిలాబాద్: అసాంఘీక కార్యకలాపాలను రూపుమాపాలి
మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 12 :- అసాంఘీక కార్యకలాపాలను రూపుమాపాలి
జైనథ్ పోలీస్ స్టేషన్‌ను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. మహారాష్ట్ర సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. అసాంఘీక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్ఐ పురుషోత్తం తదితరులున్నారు