

అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…..
జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 16 :- నిర్మల్ పట్టణ పరిధిలో ఉన్న రిసార్ట్స్, లాడ్జీలు, హోటల్స్, దాబాలను జిల్లా పోలీస్ అధికారులు వారి సిబ్బందితో కలిసి ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేస్తూ లాడ్జి నిర్వాహకులకు వచ్చిపోయే అతిథులకు సంబంధించి వారి ఆధార్ కార్డులో ఉన్న వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాలని మీ మీ లాడ్జీలకు సంబంధించిన లగ్జరీ బుక్స్ లో ప్రతిదీ క్షుణ్ణంగా నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా లాడ్జి యజమానులకు పనిచేసే సిబ్బందికి లాడ్జిల్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తో పాటు నిబంధనలను అతిక్రమించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎవర్ని ఉపేక్షించడం ఉండదని వారికి తెలియజేశారు.