అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 07 :- నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్చి 8 సెలవు దినం కావడంతో ముందస్తుగానే ఈ కార్యక్రమన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ మహిళలు హక్కులు, సామాజిక ఆర్థిక -సాంస్కృతిక- రాజకీయ సహకారాలపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య లక్ష్యం అని ప్రతి ఏడాదితో కొత్త థీమ్ తో
నిర్వహిస్తారని అన్నారు. 2025 సంవత్సరం యాక్సిలరేట్ యాక్షన్ అనగా చర్యను వేగవంతం చేయండి అనే ఇతివృత్తంతో లింగ సమానత్వం వైపు పురోగతిని వేగవంతం చేయవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతుందని పేర్కొన్నారు. ఈ థీమ్ వివిధ రంగాలలో ప్రభావితం చేసే వ్యవస్థాపిత అడ్డంకులు, పక్షపాతాలను పరిష్కరించడానికి వేగవంతమైన నిర్ణయాత్మక చర్యలను కోరుతుంది. మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అధిగమించి పురోగతి సాధించినప్పుడే మనం గర్వించదగినటువంటి విషయం అని ప్రతి మహిళ విద్యార్థులు వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుండి బయటపడుతూనే శారీరక మానసిక దృఢత్వులవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్, సిపిడిసి ప్రెసిడెంట్ డా.నాగేష్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే గృహమంతా ఆరోగ్యవంతం అవుతుందని గృహంలో ముఖ్య భూమిక వారిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారిక విభాగం కన్వీనర్ డా కల్పన, డా.నహేద, అధ్యాపకులు,సిపిడి సి సభ్యులు, కార్యాలయ సిబ్బంది విద్యార్థులు ముధోల్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. మహిళ అధ్యాపకులకు వివిధ పోటీలను నిర్వహించి వారిని సన్మానించడం జరిగింది

  • Related Posts

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లేఖ రాశారు. భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీరాములు గారు…

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    స్వాతంత్య్ర సమరయోధుడు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా దక్షత, సాహితీ ప్రేమ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బీసీ రిజర్వేషన్లపై ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..

    ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి..