Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్.. వాడివేడిగా జరిగే ఛాన్స్

Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్.. వాడివేడిగా జరిగే ఛాన్స్..!!

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి నుంచి ఒక మైనస్ పాయింట్ ఉంది. ప్రభుత్వ పథకాలేవీ సమక్రమంగా అమలు కావట్లేదనే విమర్శలున్నాయి. కొత్త రేషన్ కార్డులనే తీసుకుంటే..వాటిని జనవరి 26న ప్రారంభించినా.. ఇప్పటివరకూ వాటిని ఇవ్వలేకపోతున్నారు. పైగా ఉగాది నుంచి ఇస్తామంటున్నారు. ఇలా ఇదే కాదు చాలా పథకాల అమలులో గందరగోళం ఉంటుంది. రైతు రుణమాఫీని విడతల వారీగా అమలు చేశారు. కానీ ఇప్పటికీ చాలా మంది తమకు రుణమాఫీ కాలేదని అంటున్నారు. రైతు భరోసా కూడా అంతే. జనవరి 26న ప్రారంభించినా.. ఇప్పటివరకూ 2 ఎకరాలు కలిగిన రైతులకు మాత్రమే మనీ వచ్చిందని అంటున్నారు. మిగతా రైతులకు ఎప్పుడు ఇస్తారో తెలియట్లేదు. ప్రస్తుతం 3 ఎకరాలు ఉన్న రైతులకు ఇస్తున్నట్లు చెబుతున్నా.. తమకు మనీ రావట్లేదని రైతులు అంటున్నారు.ఇలా పథకాలు సరిగా అమలు కాకపోవడం అనేది ప్రతిపక్షాలకు కలిసొస్తోంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అనుకోవచ్చు. ఈ ఫలితాల వల్ల మళ్లీ బీజేపీ జోరు పెరిగినట్లైంది. ఆల్రెడీ బీఆర్ఎస్ చాలా జోరుగా ఉంది. ఇలా రెండు విపక్షాలూ మరింత యాక్టివ్ అవ్వడం వల్ల.. ఇది ప్రభుత్వానికి సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో సాయంత్రం 4 గంటలకు జరిగే క్యాబినెట్ సమావేశం కీలకంగా మారింది.
చర్చించే అంశాలు:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ క్యాబినెట్ భేటీ జరగనుంది. ఇందులో కులగణన, బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కమిషన్ రిపోర్టు అంశాలపై చర్చిస్తారని తెలిసింది. అలాగే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్ని ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశం కూడా చర్చిస్తారని తెలిసింది. కులగణనకు సంబంధించి ప్రభుత్వం రెండోసారి కూడా ఇంటింటి సర్వే పూర్తి చేసింది. అందువల్ల ఇక కులగణనపై పూర్తి స్పష్టత వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కేబినెట్‌లో ఆమోదం తెలిపి, అసెంబ్లీలో కూడా ఆమోదించి, కేంద్రానికి పంపాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.ఇదివరకు తెలంగాణలో బీసీల సంఖ్య 52 శాతం అనే అంచనా ఉండేది. ఐతే.. కులగణన తర్వాత ఈ సంఖ్య 42 శాతం అని ప్రభుత్వం తేల్చింది. ఆ ప్రకారమే.. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఐతే.. బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని.. కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇది ఇలా ఉంటే.. ఈమధ్య సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి.. తెలంగాణకి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు. ఈ అంశాలపై కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.

  • Related Posts

    గచ్చిబౌలి పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్ విద్యార్థులు….

    గచ్చిబౌలి పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్ విద్యార్థులు…. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ తోటి క్లాస్ మేట్ ఓ అబ్బాయితో చనువుగా వుండటం సెల్ ఫోన్ లో వీడియో తీసి తమతో కూడా ఫ్రీగా…

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    భైంసా పట్టణంలో ఆడిటోరియం అవసరం – విద్య, సాంస్కృతిక, ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతుగా నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం జనాభా గణనీయంగా పెరుగుతోంది. పట్టణీకరణ పెరిగిన కొద్దీ ప్రజల సంఖ్య కూడా అధికమవుతోంది. ముఖ్యంగా యువతలో విద్యపై ఆసక్తి పెరిగింది. ప్రతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ హతం?

    మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ హతం?

    గచ్చిబౌలి పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్ విద్యార్థులు….

    గచ్చిబౌలి పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్ విద్యార్థులు….

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు