Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ముందుకు బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లు..!!

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ముందుకు బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లు..!!

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టింది. ఎస్సీ వర్గీకరణకు అవకాశం కల్పిస్తూ బిల్లును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశ పెట్టారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ,పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మారుస్తూ, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు చేస్తూ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఎన్నికలకు ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హమీ ఇచ్చింది. కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ అసెంబ్లీ 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపనుంది. బీసీల రిజర్వేషన్ల అంశం గురించి తేలకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

  • Related Posts

    నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయిదెబ్బతిన్న వంద చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి

    నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయిదెబ్బతిన్న వంద చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండిచెప్పులరిగే దాకా తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదునియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 18 :-ముధోల్ నియోజక వర్గంలో గతంలో…

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయిదెబ్బతిన్న వంద చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి

    నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయిదెబ్బతిన్న వంద చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వండి

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు