

Telangana Assembly: కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సంభాషణ.. తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామం..!!
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ సీఎం మరియు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) హాజరవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగించింది.
గత కొంతకాలంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఈసారి సెషన్ ప్రారంభానికి ఒక గంట ముందే అసెంబ్లీకి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అసెంబ్లీకి రాకముందు, బీఆర్ఎస్ ఎల్పీ (Legislative Party) కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలతో సమావేశమై కేసీఆర్ వారికి వ్యూహాలను వివరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చకు తీసుకురావడం వంటి అంశాలపై నేతలకు స్పష్టమైన మార్గదర్శకాన్ని అందించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి మరియు ఆదినారాయణ కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలవడం విశేషం. గూడెం మహిపాల్ రెడ్డి తన తమ్ముడి పెళ్లి పత్రికను స్వయంగా కేసీఆర్‌కు అందజేయగా, ఆదినారాయణ మర్యాద పర్యటనగా కేసీఆర్‌ను కలిశారు. ఈ ఇద్దరూ గతంలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కావడం గమనార్హం.
కేసీఆర్ తిరిగి అసెంబ్లీకి హాజరవడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలవడం వంటి పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపును సూచిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో జరిగే పరిణామాలు భవిష్యత్తు రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశముం