SLBC Tunnel: ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్‌ డాగ్స్‌.. మరికొద్ది క్షణాల్లో….!!

SLBC Tunnel: ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్‌ డాగ్స్‌.. మరికొద్ది క్షణాల్లో….!!

SLBC Tunnel Cadaver Dogs: SLBC ప్రమాద ఘటనలో కార్మికుల జాడ గుర్తింపునకు తుదిదశకు చేరుకుంది. ఈ SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో 15 రోజులు నుంచి వారిని రక్షించేందుకు సహాయకరణ చర్యలు చేపడుతూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు వారు ఇంకా బతికే ఉంటారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ విశ్వప్రయత్నాలు చేసినా కార్మికుల ఆనవాళ్లు మాత్రం గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు కేరళకు చెందిన క్యాడవర్‌ డాగ్స్ ఆ కార్మికుల ఆనవాళ్లు గుర్తించాయి. ప్రమాద స్థలం నుంచి 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించాయి. కేరళ నుంచి ప్రత్యేక విమానంలో ఈ డాగ్స్‌ కార్మికుల జాడను గుర్తించేందుకు తీసుకువచ్చారు. అయితే, కేరళ వరదల సమయంలో కూడా క్యాడవర్‌ డాగ్స్‌ ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకే కార్మికుల జాడ కోసం ప్రభుత్వం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. అయితే మరికొన్ని గంటల్లో గల్లంతైన వారు ఆచూకీ లభించే అవకాశం ఉంది అక్కడ సిబ్బంది మట్టిని తొలగిస్తున్నారు. 16 రోజులుగా వివిధ పద్ధతుల్లో కార్మికుల జాడ కోసం ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.. SLBC టన్నెల్ పనుల్లో భాగంగా కార్మికులు ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. ఆ సమయంలోనే టన్నెల్‌ పైకప్పు భాగం కూలిపోవడంతో కార్మికులు అందులో చిక్కుకున్నారు. ఇందులో 8 మంది కార్మికులు ఉండగా అందులో ఎక్కువ శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు.. అప్పటినుంచి ప్రభుత్వం దగ్గర ఉండి సహాయక చర్యలు చేపట్టింది. వారిని రక్షించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉంది. ఘటన జరిగిన వెంటనే మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అక్కడికి చేరుకొని దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. అంతేకాదు ప్రత్యేక నిపుణులు కూడా అక్కడే ఉండి దగ్గరుండి పనులను సమీక్షిస్తున్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించిన కార్మికుల జాడ తెలియని రాలేదు. రోబోటిక్ టెక్నాలజీ ప్రయోగించాలని కూడా చూశారు.. కానీ ఈ సందర్భంగా టన్నెల్‌ మరింత కుప్పకూలే ప్రమాదం ఉందని కూడా ఊహించారు. ర్యాడర్‌ టెక్నాలజీతో 8 భాగాల్లో మనుషుల ఆనవాళ్లను కూడా గుర్తించారు కానీ, మట్టి దిబ్బలు నీటి ఊట వల్ల సహాయక చర్యలో జాప్యం జరిగింది. అంతేకాదు టన్నెల్లోకి వెళ్లి రావడానికి దాదాపు 6 గంటల సమయం పడుతుంది. ఒకవైపు నీటిని తోడుతూ.. మట్టిని తొలగిస్తూ సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఈ SLBC టన్నెల్ ప్రాజెక్టులో భాగంగా నల్గొండ ఇతర పక్కన చుట్టుముట్టు జిల్లాలకు తాగు సాగునీటిని అందించేందుకు చేపట్టారు. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది వెంటనే ప్రధాని మోడీ కూడా పరిస్థితిని ఆరా తీశారు.. సహాయక చర్యలు చేపట్టడానికి సాయం అందిస్తామన్నారు. ఇక అక్కడ మట్టి తోడుతున్న సిబ్బంది అతి కొద్ది సమయంలోనే కార్మికుల జాడ గుర్తించే అవకాశం ఉంది

  • Related Posts

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గారి వ్యక్తిగత సహాయకులు విజేందర్ రెడ్డితో కలిసి చిట్యాల రామచంద్రంకు ఘన నివాళులు మనోరంజని ప్రతినిధి…

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 – మద్యం ప్రియులకు బాధాకరమైన వార్త ఏమి టంటే? రంగుల హోలీ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు మద్యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.