MLA కోటా.. 10 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్
మనోరంజని ప్రతినిధి మార్చి ౦౩ ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11న పరిశీలన, 13న ఉపసంహరణ గడువు ఉంటుంది. 20న అసెంబ్లీలో పోలింగ్.. అదే రోజు సా.5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా, ఏపీలో ఖాళీలకు టీడీపీ నుంచి వంగవీటి రాధా, జవహర్, ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి మాధవ్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది