IND vs NZ: టీమిండియా ఘన విజయం! ఇక ఆసీస్‌తో సెమీస్ సమరానికి సై..!!
ఛాంపియన్స్ ట్రోఫీలో 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయినా..
30 పరుగులకే టాపార్డర్ కుప్పకూలిన భారత జట్టు కోలుకొని నిలబడిన తీరు అద్భుతమనే చెప్పాలి. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ 4వ వికెట్‌కు జోడించిన 98 పరుగుల పార్ట్నర్‌షిప్‌తో పాటు, చివర్లో పాండ్యా ఆడిన 45 పరుగుల ఇన్నింగ్స్ టీమిండియాకు మంచి స్కోర్ ఇచ్చింది. ఇక ఈ విజయంతో టీమిండియా మంగళవారం(మార్చ్ 4న) తొలి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొట్ట నుంది. ఆస్ట్రేలియాను సెమీస్‌లోనే ఓడించేస్తే ఇక ఫైనల్‌లో టీమిండియా కూల్‌గా ఆడి కప్పు కొట్టడం ఖాయమని క్రికెట్ అభిమానులు కూడా భావిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు కివీస్ బౌలర్లు ఆరంభంలోనే గట్టి షాకిచ్చారు. పవర్ ప్లే ముగిసే లోపే.. టీమిండియా టాప్ 3 బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. తొలుత శుబ్‌మన్ గిల్(2), మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్‌గా అవుట్ అయ్యాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ(15) జెమిసన్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చిన పెవిలియన్ చేరాడు. ఇక విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు కొట్టి.. గత మ్యాచ్‌లో ఎక్కడైతే ఆపేశాడో అక్కడి నుంచి మొదలుపెడుతున్నట్లు కనిపించాడు.
కానీ, సూపర్ మ్యాన్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్‌తో కోహ్లీ అవుట్ అయ్యాడు. పాయింట్‌లో సూపర్‌గా గాల్లోకి డైవ్ చేస్తూ ఫిలిప్స్ క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అక్షర్ పటేల్ 61 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేటికే అయ్యర్ అవుట్ అయ్యాడు. 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 79 పరుగులతో సెంచరీ దిశగా సాగుతున్నట్లు కనిపించినా.. విలియన్ రూర్కీ బౌలింగ్‌లో తన షార్ట్ పిచ్ బాల్ వీక్‌నెస్‌కు మరోసారి బలయ్యాడు. ఇక రాహుల్ 23, జడేజా 16 రన్స్ చేసి నిరాశపర్చారు. హార్ధిక్ పాండ్యా 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేయడంతో టీమిండియాకు మంచి ఫైటింగ్ స్కోర్ వచ్చింది. షమీ 5 పరుగుల చేసి 9వ వికెట్‌గా అయ్యాడు. కుల్దీప్ ఒక్క పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు.
కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో సత్తా చాటాడు. జెమిసన్, విలియమ్ రూర్కీ, సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసుకున్నారు. ఇక 250 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు హార్ధిక్ పాండ్యా ఆరంభంలోనే ఎదురుదెబ్బ కొట్టాడు. ఓపెనర్ రచిన్ రవీంద్రను అవుట్ చేశాడు. ఆ తర్వాత విల్ యంగ్‌ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కేన్ విలియమ్సన్ మాత్రం క్రీజ్‌లో పాతుకుపోయాడు. దాదాపు అతనొక్కడే 20 ఓవర్లు బ్యాటింగ్ చేశాడు. 120 బంతుల్లో 7 ఫోర్లతో 81 పరుగులు చేసి 7వ వికెట్‌గా వెనుదిరిగాడు. విలియమ్స్ తప్పితే మిగతా బ్యాటర్లు పెద్దగా ఇంప్యాక్ట్ చూపించలేదు. డారిల్ మిచెల్ 17, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 12, మిచెల్ బ్రేస్‌వెల్ 2 పరుగులు చేసి విఫలం అయ్యారు.
చివర్లో కివీస్ కెప్టెన్ సాంట్నర్ కొద్ది సేపు మెరుపులు మెరిపించినా.. అప్పటికే రిక్వైర్డ్ రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. 31 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సులతో 28 పరుగులు చేసిన సాంట్నర్‌ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. భాతర బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఏకంగా 5 వికెట్ల హాల్ సాధించాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లు ఆడని వరుణ్, అవకాశం వచ్చిన మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూపించాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే సెమీస్‌లో కూడా వరుణ్ టీమ్‌లో ఉంటే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక జడేజా 2, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్డీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు