

HYD: మెట్రోలో గుండె తరలించిన వైద్యులు
HYD మెట్రో అరుదైన ఘనత సొంత చేసుకుంది.
ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి మెట్రోలో గుండెను తరలించారు. డయిలేటెడ్ కార్డియోమయోపతి సమస్య తో బాధపడుతున్న 44 ఏళ్ల వ్యక్తికి శనివారం ఎమర్జెన్సీ అవ్వగా వారు మెట్రోనే ఎంచుకున్నారు. వైద్యులు నాగోల్లో మెట్రో ఎక్కి జూబ్లీహిల్స్లో దిగారు. ఇలా గుండెను తరలించడాన్ని గ్రీన్ ఛానల్ అంటారు