Harish Rao: మల్లన్నసాగర్ భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించండి: హరీశ్‌రావు..!!
మనోరంజని ప్రతినిధి గజ్వేల్, మార్చి 12 : మల్లన్నసాగర్ భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులకు అండగా ఉంటానని గతంలో భూ నిర్వాసిత గ్రామమైన ఏటిగడ్డ కిష్టాపూర్‌లో రేవంత్‌రెడ్డి నిరహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని, ఆ బాధ్యత ఆయనపైనే ఉందని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో 90% ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పునరావాస కాలనీల నిర్మాణం, ఇంటి స్థలాలు, మౌలిక సదుపాయాలు కల్పించామని మిగిలిన 10% సమస్యలు గత ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లోనే పెట్టిందన్నారు