మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి 3, 2025: ఈరోజు బంగారం ధరలు రికార్డు స్థాయిలో పడిపోవడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగించింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికా డాలర్ బలపడటం వల్ల బులియన్ మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గింది. ఇక అమెరికా ద్రవ్యోల్బణ డేటా, రిజర్వ్ మానిటరీ పాలసీపై పెట్టుబడిదారులు ఎదురుచూడడం కూడా ఈ ధర తగ్గుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టడం తగ్గించడంతో, ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. గత ఏడాది నవంబర్ నుండి ఇప్పటివరకు ఏ వారం మొత్తంలో కూడా ఇంత భారీ తగ్గుదల కనిపించలేదని మార్కెట్ నిపుణులు తెలిపారు.