

Central Govt.: ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు.. వేతనం పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు..
దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద కూలీలకు వెతనం పెంచుతూ.. నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కనీస వేతనం రూ.300 నుంచి రూ.307లకు పెంచారు. అయితే పెంచిన వేతన 2024-25 కంటే రూ.7 అదనం. అయితే, పెరిగిన వేతనం ఏప్రిల్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Union Ministry of Rural Development) వెల్లడించింది. కాగా, ఉపాధి హామీ పథకం 2005లో ప్రారంభం అయినప్పటికీ.. అధికారంగా 2006లో అధికారికంగా ఆయా రాష్ట్రాల్లో అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు కనీసం 100 రోజులు పని కల్పిస్తూ.. వారి జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది. ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక భద్రత, ఉపాధి దొరుకుంతుండటంతో పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది