

BREAKING: మరో దేశం లో భూకంపం…
మయన్మార్, బ్యాంకాక్ దేశాల్లో సంభవించిన భారీ భూకంపాన్ని మరువకముందే మరో దేశంలో భూమి కంపించింది. అఫ్గాన్లో 4.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. ఇవాళ ఉ.5.16 గంటలకు భూమి కంపించినట్లు తెలిపింది. తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగి ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే వరుస భూకంపాలతో మయన్మార్, థాయ్లాండ్, భారత్, చైనా తదితర దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి