

Bengaluru: పాకిస్తాన్‌కు రహస్య సమాచారం.. బెంగళూరులో బెల్ ఉద్యోగి అరెస్ట్
బెంగళూరులో పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నందుకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఉద్యోగి అనే భారతీయుడిని కేంద్ర నిఘా సంస్థలు గురువారం అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర, కేంద్ర, సైనిక నిఘా సంస్థలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.అరెస్టు చేసిన వ్యక్తిని దీప్ రాజ్ చంద్రగా గుర్తించారు.
అతను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లోని ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, ఆవిష్కరణ కేంద్ర విభాగంలో పనిచేశాడు.నిందితుడు బెంగళూరులోని మట్టికెరె ప్రాంతంలో నివసిస్తున్నట్లు గుర్తించారు.
నిందితుడు దీప్ రాజ్ చంద్ర ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందినవాడు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కేంద్ర సంస్థల అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది