AP And TG Weather Report: నేటి నుంచి భానుడి భగభగ.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!

AP And TG Weather Report: నేటి నుంచి భానుడి భగభగ.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 21 నుంచి 24 మధ్య వర్షాలు జోరుగా కురిసాయి. ప్రజలు హాయి హాయిగా చల్ల చల్లని గాలి, వర్షాల మద్య ఎంజాయ్ చేశారు. కానీ ఇకపై అలా జరగదు.
ఎండలు మళ్లీ మొదలయ్యాయి. ఉదయం కాగానే భగభగ మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఇక నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో వడగాలలు మొదలు కానున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలు.. ఇప్పుడు మరింత జాగ్రత్త పడాల్సి ఉంది. తాజాగా వాతావరణ శాఖ కీలక ప్రకటన రిలీజ్ చేసింది. ఇవాళ్టి నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తాడని పేర్కొంది.

తెలంగాణలో

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలను అలర్ట్ చేసింది. దక్షిణ ఛతీస్ఘడ్ నుంచి మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. అందువల్ల 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వడగాలులు తీవ్రంగా వీసే అవకాశం ఉందని పేర్కొంది.

అందులో ఆదిలాబాద్లో గరిష్టంగా 39.3, నల్గొండలో 35 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది. ఇక నిన్నటి విషయానికొస్తే.. ఆదిలాబాద్లో 38.3 డిగ్రీలు, మహబూబ్ నగర్లో 35.5 డిగ్రీలు, నిజామాబాద్లో 37.3 డిగ్రీలు, హనుమకొండలో 35 డిగ్రీలు, భద్రాచలంలో 38 డిగ్రీలు, ఖమ్మంలో 36.6 డిగ్రీలు, నల్లగొండలో 36 డిగ్రీలు, మెదక్లో 35.4 డిగ్రీలు, రామగుండంలో 35.6 డిగ్రీలు, హైదరాబాద్లో 33.8 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఏపీలో వాతావరణం

అలాగే ఏపీలో సైతం సూర్యుడు తన ప్రతాపం చూపించబోతున్నాడు. నేడు 108 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో -15 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో- 21 డిగ్రీలు, పార్వతీపురంమన్యం జిల్లాలో-10 డిగ్రీలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో -8డిగ్రీలు, అనకాపల్లిలో- 7 డిగ్రీలు, కాకినాడలో -7 డిగ్రీలు, కోనసీమలో -3 డిగ్రీలు, తూర్పుగోదావరిలో- 13 డిగ్రీలు, ఏలూరులో -5 డిగ్రీలు, కృష్ణాలో -2 డిగ్రీలు, ఎన్టీఆర్- జిల్లాలో 6 డిగ్రీలు, గుంటూరులో -3 డిగ్రీలు, పల్నాడు-లోని 8 మండలాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేసింది

  • Related Posts

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    దేశాన్ని విభజింటే కుట్ర.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు కరీంనగర్‌: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ కీలక నేత.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ విభజనకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఉగాది…

    Ugadi 2025: ఉగాది పచ్చడిలో ఆరు రుచులు.. ఆరు సంకేతాలకు సూచికం.

    Ugadi 2025: ఉగాది పచ్చడిలో ఆరు రుచులు.. ఆరు సంకేతాలకు సూచికం. ఉగాది పండుగ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది.. ఉగాది పచ్చడి.. కొత్త సంవత్సరం రోజు షడ్రుచులతో తయారు చేసే ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెపుతుంటారు. ఇందులో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం