

ALERT: నేడు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలోని 19 మండలాల్లో బుధవారం తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం, ఉంగటూరు, బలిజపేట, ఉయ్యూరు, మక్కువ, కొమరాడ, జియమ్మవలస, గురుగుబిల్లి, పాలకొండ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట, వీరఘట్టం, హీరా, బూర్జ, లక్ష్మీనరసుపేట, బొబ్బిలి, వంగర, హీరా మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే 180 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది