_వరంగల్లో దేశంలోనే తొలి గోల్డ్ లోన్ ATM.. పావు గంటలో చేతికి డబ్బులు…!!

_వరంగల్లో దేశంలోనే తొలి గోల్డ్ లోన్ ATM.. పావు గంటలో చేతికి డబ్బులు…!!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎంత కష్టమైన పని అయినా చాలా సులువుగా, ఎంతో మంది చేసే పనిని తక్కువ మందితో చేసే సౌకర్యం కృత్రిమ మేధ కల్పిస్తోంది.

తాజాగా ఏఐ ఆధారంగా పనిచేసే గోల్డ్ లోన్ ఏటీఎం అందుబాటులోకి రావడం విశేషం.

ఇండియాలోనే తొలి గోల్డ్ లోన్ ఏటీఎం ను వరంగల్ లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎం.వి.రావు శుక్రవారం (మార్చి7) ఏటీఎంను లాంచ్ చేశారు. ఈ ఏటీఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఫైనాన్షియల్ సెక్టార్ లో ఇది గేమ్ ఛేంజర్ ఇన్నోవేషన్ కానుందని ఈ సందర్భంగా ఎం.వి.రావు తెలిపారు.

గోల్డ్ లోన్ ను కేవలం 10 నుంచి 12 నిమిషాలలో ప్రాసెస్ చేస్తుంది ఈ ఏటీఎం. ఆధార్, మొబైల్ నంబర్ వెరిఫికేషన్ చేసి చాలా తొందరగా గోల్డ్ లోన్ ప్రాసెస్ చేస్తుంది ఈ ఏఐ ATM.

ATM ఎలా పనిచేస్తుందంటే..

ఏటీఎం మెషిన్ లో బంగారు ఆభరణాలు వేసినపుడు వాటి క్వాలిటీ, బరువును అంచనా వేస్తుంది. బంగారం క్వాలిటీని బట్టి ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా పేమెంట్ చేస్తుంది. చాలా కచ్చితమైన లెక్కలతో ఇది ఆభరణాలను కొలుచి పేమెంట్ చేస్తుందని అంటున్నారు.

ఏటీఎం మెషీన్ లో వేసిన బంగారాన్ని తూచిన తర్వాత 10 శాతం అమౌంట్ ను క్యాష్ రూపంలో ఏటీఎంలో అప్పటికప్పుడే చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అయితే వినియోగదారులు సెంట్రల్ బ్యాంకు ఖాతాదారులై ఉండాలి.

బ్యాంక్ సిబ్బందితో పాటు కస్టమర్స్ సమయాన్ని ఆదా చేసుందుకు ఈ ఏటీఎం ఉపయోగపడుతుంది. అదే విధంగా గోల్డ్ లోన్ గురించి అధికారులపై ఆధారపడకుండా, ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఈ టెక్నాలజీ ఏటీఎం ఉపకరిస్తుంది. ఇది సక్సెస్ అయితే దేశంలోని అన్ని బ్రాంచులలో ఏర్పాటు చేస్తామని సీఈఓ ఎం.వి.రావు తెలిపారు

  • Related Posts

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’ భారతదేశంలో ప్రస్తుతం దేశనలుమూలల 5G సర్వీసు లభిస్తోందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 776 జిల్లాల్లో 773 జిల్లాలకు ఈ సర్వీసు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. టెల్ కమ్ సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు అన్ని…

    నెక్సా షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

    నెక్సా షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిమనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 10: షాద్ నగర్ పట్టణంలోని మహబూబ్ నగర్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన నెక్సా షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం